GNTR: వైసీపీ పునాదులను మరింత బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన కార్యదర్శులను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.