SRD: కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్ గ్రామంలో విద్యుత్ ఎస్ఈ శ్రీనాథ్ రైతుల పొలాల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాపై రైతులతో ముఖాముఖిగా చర్చించి కరెంటు సమస్యలపై మంగళవారం ఆరా తీశారు. వ్యవసాయ పంటలకు కరెంటు ఏ సమస్య లేకుండా అందుతుందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నందకుమార్, ఈ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.