ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్లో 1 నుంచి 7 స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఒక ఎకరా వున్న రైతుకు ఒక బ్యాగ్, అలాగే 10 ఎకరాలు ఉన్న రైతుకి కూడా ఒక బ్యాగ్ ఇవ్వడం, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.