E.G: తాళ్లపూడి మండలంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 11 మంది లబ్ధిదారులకు కొవ్వూరులోని టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదగా బుధవారం సాయంత్రం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రూ.4,32,974/- విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.