ATP: స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణకు ముందస్తు సన్నాహకాలలో భాగంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ బుధవారం డీటీసీని సందర్శించారు. బ్యారక్కులు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్, జిమ్ వంటి మౌలిక వసతులను పరిశీలించారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణార్థుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు.