VSP: భీమిలిలోని పీఎమ్ పాలెంలోని తారాకారామ్నగర్లో శ్రీ సాయి శక్తి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలకు బుధవారం పందిరి రాట ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో చవితి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మిసత్యనారాయణ, సెక్రటరీ ఎమ్.డీ. అనీషాఆదిల్ తెలిపారు.