SKLM: భారీ వర్షానికి ఆమదాలవలస మండలంలో చెవ్వాకులపేట గ్రామంలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇంకా వర్షం నీరు బయటకు వెళ్లకపోవడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి మధుపులు పెట్టి పంటలు వేశామని ఈ ముంపు వలన వరి పంటలు దెబ్బతింటాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.