BDK: టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలకు మరమ్మత్తులు చేయాలని DSFI రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రం అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై బుధవారం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలోని అన్ని తరగతులలో విద్యుత్ లైట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే కళాశాల గ్రౌండ్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.