AP: వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విజయవాడకు తరలించారు. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరగా తమపై తన అనుచరులతో దాడి చేయించారని బంధువులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాతను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.