మేడ్చల్: ఉప్పల్ సర్కిల్-2 లోని రామంతాపూర్, ఇందిరానగర్, లక్ష్మారెడ్డి కాలనీ, స్వరూప్ నగర్, పద్మావతి కాలనీ, సత్యానగర్, భరత్ నగర్ తదితర ప్రాంతాల్లో రూ. 41 కోట్ల 20 లక్షల అభివృద్ధి పనులకు ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి పాల్గొన్నారు.