CTR: కుప్పంలో ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు నీటిని చెరువులకు విడుదల చేయనున్నారు. మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని జిల్లాలకు సాగు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు.