జీఎస్టీ శ్లాబుల సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వచ్చేనెలలో జరిగే GST సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. 12 శాతం, 28 శాతం శ్లాబులు తొలగించి.. 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచనుంది. దీంతో ఆటోమొబైల్, నిత్యవసరాల ధరలు తగ్గనున్నాయి. కాగా, జీఎస్టీలో ఉన్న 4 శ్లాబులను రెండుకు తగ్గిస్తూ ఇటీవల కేంద్రం ఆర్థిక శాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపిన విషయం తెలిసిందే.