SRD: పటాన్చెరు రిచ్ అండ్ ఎలైట్( శాంతినగర్, శ్రీనగర్) కాలనీలలో కొలువైన అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామివ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేగూడెంమహిపాల్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు డాక్టర్ నర్ర బిక్షపతి, గౌరవాధ్యక్షుడు రమా సంజీవరెడ్డిలు గూడెంను సత్కరించారు.