ASR: కొయ్యూరు మండలంలోని నడింపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు నేతల అప్పారావును సస్పెండ్ చేసినట్లు డీఈవో పీ.బ్రహ్మాజీరావు గురువారం తెలిపారు. ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఉన్నాడని, పాఠశాలకు సక్రమంగా విధులకు రావడం లేదని, పిల్లలు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో మీడియాకు తెలిపారు.