SKLM: సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి ఆర్అండ్బీ అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలో అలికాం–బత్తిలి (ఏబీ) ప్రధాన రహదారితో పాటు పాలకొండ, ఎరగాం వెళ్లే రోడ్లలోని ఆక్రమణలు తొలగింపు చేపట్టినట్లు డీఈ సాగర్ తెలిపారు. ఆక్రమణలు తొలగించి నాలుగు రోడ్లలోని డ్రైనేజీతో పాటు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు.