NTR: రైతులకు వేగవంతమైన రుణాలు అందించాలని నందిగామలో డీసీసీబీ ఛైర్మన్ నెట్టెం రఘురామ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నందిగామలో డీసీసీబీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై ప్రచారం బలోపేతం చేయాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులతో పోటీలో ముందంజలో ఉండాలని చెప్పారు. రైతులు, వినియోగదారుల అభిప్రాయాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు.