ELR: కైకలూరు మండలం కొల్లేటికోట శ్రీ పెద్దింట్ల అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి 470 పైగా భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారన్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు.