MNCL: వేమనపల్లి మండలం, నీల్వాయి గ్రామంలో BJP మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘర్ ఘర్ బీజేపీ – హర్ ఘర్ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దేశ ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న సేవలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. గ్రామ సౌభాగ్యం ఒక్క బీజేపీతోనే సాధ్యపడుతుందని తెలిపారు.