W.G: ఆకివీడు జవహర్ పేటలో మూడు రైస్ మిల్లుల నుంచి దుమ్ము, దూగర, ఊక విపరీతంగా వచ్చి అక్కడ నివసిస్తున్న వార్డు ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని. స్థానిక ప్రజలు శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో వెంకటేశ్వరావుకు విన్నవించుకున్నారు. ఎమ్మార్వో క్షేత్రస్థాయిలోకి వచ్చి మేటగట్టిన ఊకను తరలించాలని అప్పటివరకు మిల్లులు త్రిప్పవద్దని ఆదేశించారు.