GNTR: గుంటూరు నగరంలోని పలు ఫెస్టిసైడ్స్ & ఫెర్టిలైజర్స్ దుకాణాలు, గోదాములపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం అదనపు డైరెక్టర్ మోహన్రావు నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో నిల్వలు, రికార్డులు పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు కల్తీలను అరికట్టడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.