W.G: పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలు కూటమి ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరం సీపీఎం కార్యాలయంలో జరిగిన జిల్లా శిక్షణ తరగతులలో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.