JN: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని శుక్రవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి–వరంగల్ NH-163 లో పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్ల పనులు పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, స్టేషన్ ఘనపూర్, చిన్నపెండ్యాల్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్ల లింకులు లేవన్నారు.