NZB: జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సీపీ సాయి చైతన్య శుక్రవారం సందర్శించారు. గత వారం రోజులుగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుండటంతో, ఆయన ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద సందర్శకుల తాకిడి అధికంగా ఉన్నందున, పోలీస్ అధికారులకు భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.