W.G: 16 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థికి టీటీ ఇంజక్షన్లు తప్పనిసరని ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ నర్స్ హెప్పి కుమారి అన్నారు. శుక్రవారం ఉండి ఐటీఐ కళాశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాలేజీలో చదివే 70 మంది విద్యార్థులకు టీటీ ఇంజక్షన్లు చేయటం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.