SDPT: ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలని సిబ్బందికి సిద్దిపేట సీపీ డా. అనురాధ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశీలించి రికార్డు తనిఖీ చేశారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.