ELR: జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూర్య చంద్రరావు అన్నారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు, వట్లూరులోని CRR రెడ్డి కళాశాలలో ఇన్స్ఫెక్టర్ కోటేశ్వరరావు, శక్తి టీమ్‌తో కలిసి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు.