VZM: జిల్లాలో ఎరువులకు కొరత లేదని సరిపడినంత అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. రైతుకు ఆందోళన చెందనసరం లేదని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, జె.సిలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు మన జిల్లా ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వివరించారు.