స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదని, ఎంత మంచి మూవీలు తీశామనేది ముఖ్యమని అన్నారు. తాను శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నానని, అందుకే తక్కువ ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయనని చెప్పారు. ప్రాజెక్టుల సంఖ్య తగ్గిందని, కానీ వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుందన్నారు.