సత్యసాయి: హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ప్రస్తుతం బెంగళూరు–హిందూపురం మధ్య నడుస్తున్న (06517/06518) మెము ప్యాసింజర్ రైలును గుంతకల్లు వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను బుధవారం కోరారు. దీనిపై పరిశీలించి త్వరలోనే నిర్ణయం తెలియజేస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చినట్లు ఎంపీ వెల్లడించారు.