E.G: జిల్లాలో గల ప్రభుత్వ ITIలో 2025-26 సంవత్సరానికి 3వ విడత అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజమండ్రి ప్రభుత్వ ITI ప్రిన్సిపాల్ C.H సునీల్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 26లోపు అన్ని ధ్రువపత్రాలతో iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం 27న రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ITIలో వెరిఫికేషన్ ఉంటుందన్నారు.