VKB: పరిగి పట్టణంలోని శ్రీశ్రీ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి-ఉమారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, స్వామివారికి అభిషేకం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోమం, అంజనేయ, నాగ, ధ్వజ హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.