TG: ఓటు చోరీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి లోగో ఆవిష్కరించారు. ఓటు చోరీని నిరోధించేందుకు ప్రజలు తమ ఓటరు జాబితాలో పేర్లు తనిఖీ చేసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. రాహుల్ గాంధీ ఈ విషయంలో ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఉద్యమిస్తున్నారని అన్నారు.