NLR: అల్లూరు పట్టణంలో సోమవారం ఉదయం 10 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మండల రెవెన్యూ అధికారి లక్ష్మీనారాయణ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల చేత అర్హులైన లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.