PLD: సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో స్త్రీ శక్తి పథకంతో మహిళా సాధికారత విజయోత్సవ సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా శక్తివంతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.