MNCL: తాండూర్ మండలం మాదారం అడవుల్లోకి పెద్దపులి శనివారం ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు శనివారం వెల్లడించారు. రొంపల్లి, దేవాపూర్, ధర్మారావుపేట, బెలంపల్లి పరిధిలో పులి తిరుగాడుతోంది. మాదారం టౌన్ షిప్‌కు కేవలం 2 కిలోమీటర్ల పరిధిలో చింతలలొద్ది ప్రాంతంలో తిరుగుటున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.