MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధి ఎర్రగుంట చెరువును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం సబ్ కలెక్టర్ సాయి మనోజ్‌కు వినతి పత్రం సమర్పించారు. కబ్జాకు గురైన ఎర్రగుంట చెరువుపై విచారణ జరిపించాలని కోరారు. చెరువుపై ఆధారపడ్డ మత్స్యకారులు, గీతా కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.