KRNL: ప్రజలు స్వచ్ఛతను యజ్ఞంగా భావిస్తేనే ఆరోగ్యమైన సమాజానికి బలమైన పునాదులు పడతాయని కమిషనర్ విశ్వనాథ్ అన్నారు. ఇవాళ డాక్టర్స్ కాలనీ పార్కులో ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పౌరుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, పరిసరాల పరిశుభ్రతకు అంతే ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు.