NZB: జిల్లా అదనపు మెజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్ ముందు పోలీస్ కమిషనేట్ పరిధిలోని 13 మంది శనివారం బైండోవర్ అయ్యారు. గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబి, దుర్గామాత ఉత్సవాల సందర్భంగా డీజే ఆపరేటర్లు, యజమానులు, ట్రబుల్ మేకర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే ఆరు నెలల పాటు సత్ప్రవర్తనతో ఉండాలని, లేనిపక్షంలో పూచీకత్తు సొమ్మును జప్తు చేసి జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.