RR: నిండు అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ డిమాండ్ చేశారు. షాద్నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలు చేపట్టారు. ఉద్యోగ నియామకాలలో మాదిగల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.