• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరణ

SRPT: జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు.

March 10, 2025 / 10:47 AM IST

‘ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్’

ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో నూతనంగా  నిర్మిస్తున్న శ్రీ జగదాంబ దేవి, సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పరిశీలించారు పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టారని గ్రామస్తులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

March 10, 2025 / 10:43 AM IST

‘సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి’

ADB: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఉట్నూర్ నేతకాని సంఘం నాయకులు కోరారు. సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా సోమవారం ఆ సంఘం నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మహేందర్, సంఘం నాయకులు దర్శన గంగరాజు పాల్గొన్నారు.

March 10, 2025 / 10:40 AM IST

మూసీ ప్రాజెక్టుకు పూర్తిగా తగ్గిన వరద ప్రవాహం

NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిగా తగ్గింది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 631.30 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు. లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా రైతులకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు పంపిస్తున్నారు.

March 10, 2025 / 10:03 AM IST

ఇండియా క్రికెట్ గెలుపొందిన సందర్భంగా సంబరాలు

KNR: ఇండియా క్రికెట్ టీం ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రాత్రి 10: 40 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో బాణా సంచాలు పేల్చి సంబరాలు జరిపారు. భారత క్రికెట్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

March 10, 2025 / 04:14 AM IST

ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వ్యాన్కు నిప్పు: ఎస్సై

SRCL: తంగళ్ళపల్లి(M) టెక్స్ టైల్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వివరాల్లో కెళితే.. గ్రామానికి చెందిన నిమ్మల మహేశ్ అనే వ్యక్తి 9 నెలల క్రితం వ్యాను కొన్నాడు. ఈ క్రమంలో EMIలు కట్టలేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే డీసీఎంకు నిప్పు పెట్టాడని ఎస్సై రామ్మోహన్ తెలిపారు. గ్రామ కారొబార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

March 10, 2025 / 04:08 AM IST

నేటి నుంచి ప్రజావాణి తిరిగి ప్రారంభం: కలెక్టర్

JGL: జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి(సోమవారం) నుండి తిరిగి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సంద్భంగా ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చునని సూచించారు.

March 10, 2025 / 04:03 AM IST

ఆస్పత్రిస్థలం మార్చాలని ఎమ్మెల్యేకు వినతి

SRCL: భీమారం గ్రామస్థులు ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. భీమారం మండల కేంద్రానికి 30 పడకల ఆస్పత్రి ఇటీవల మంజూరైంది. అధికారులు బీట్ వద్ద స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. అయితే ఈ స్థలంలో ఆస్పత్రి మంజూరు చేస్తే రైతులకు ఇబ్బందిగా అవుతుందని, వేరే స్థలంలో ఆస్పత్రిని నిర్మించాలని కోరుతూ.. ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.

March 9, 2025 / 08:16 PM IST

‘స్ట్రీట్ లైట్స్‌ను ఢీకొట్టిన కారు’

KNR: గిద్దె పెరుమాండ్ల దేవస్థానం గ్రౌండ్‌లో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో వ్యక్తి కారు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ట్రాక్‌పై ఉన్న స్ట్రీట్ లైట్స్‌, పూలమొక్కలు, కుండీలను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాకర్లు భయాందోళనకు లోనయ్యారు.

March 9, 2025 / 08:05 PM IST

‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు’

KNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.

March 9, 2025 / 08:04 PM IST

‘ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు’

SRD: ప్యారా నగర్ రైతులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడు గుర్తుకు వచ్చాను అని ప్యారా నగర్ రైతులతో ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని చెప్పారు. ఆందోళనతో ఉన్న రైతులతో మాట్లాడే విధానం సరికాదని పేర్కొన్నారు.

March 9, 2025 / 07:54 PM IST

శరవేగంగా కల్లూరు CHC పనులు

KMM: కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న, 50 పడకల ఆసుపత్రి, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో అందుటుబాలోకి తెచ్చేందుకు, సుమారు రూ.10 కోట్లతో CHC నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భవనానికి శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి.

March 9, 2025 / 07:25 PM IST

గుండంలో మునిగి బాలుడి మృతి

MDK: శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గుండంలో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వారం వారం జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ బాలాజీనగర్‌కు చెందిన కరుణాకర్ (14) కుటుంబం విచ్చేసింది. ఈ క్రమంలో ఆలయం వద్ద గుండంలో స్నానం చేసేందుకు దిగిన కరుణాకర్ మునిగి మృతి చెందాడు. 

March 9, 2025 / 05:18 PM IST

‘నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి’

NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని తోలు పరిశ్రమ, లక్కం పల్లి సేజ్‌లో నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాలు విన్నవించారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో స్థానిక యువకులకు ఆర్థిక భారం లేకుండా పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు.

March 9, 2025 / 05:14 PM IST

‘హత్యకేసులో నిందితుడి అరెస్ట్’

మేడ్చల్: జవహర్ నగర్ కౌకూర్లో తల్లి కూతురును హతమార్చిన ఘటనలో నిందితుడు అరవింద్‌ను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడు అరవింద్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు పారిపోయే క్రమంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఆదివారం జవహర్ నగర్ పోలీసులు పేర్కొన్నారు.

March 9, 2025 / 05:12 PM IST