NZB: ఆర్మూర్ నియోజకవర్గంలోని తోలు పరిశ్రమ, లక్కం పల్లి సేజ్లో నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ బాలు విన్నవించారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో స్థానిక యువకులకు ఆర్థిక భారం లేకుండా పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు.