KMM: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ DCPఆడ్మీన్ నరేష్ కుమార్ తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ను CEIRపోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ.7 లక్షలని పేర్కొన్నారు.