NRML: జన సంచార ప్రదేశాల్లో వేసవికాలం దృష్ట్యా చలి కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్టాండ్, మంచిర్యాల తదితర ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.