MBNR: మతసామరస్యానికి మొహర్రం ప్రతీక అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రామయ్యబౌలి, పాతపాలమూరు కాలనీలలో ఏర్పాటుచేసిన పీర్లను గురువారం రాత్రి ఎమ్మెల్యే దర్శించుకోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకొని ఐక్యత చాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లకొత్వాల్, ముడాచైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
MNCL: హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహాసభ శుక్రవారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసి గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కార్గేను ఆయన కోరారు.
ADB: బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల ప్రొవిజనల్ లిస్టును శుక్రవారం విడుదల చేయనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బాసర క్యాంపస్ 1500 సీట్లు, మహబూబ్ నగర్ సెంటర్లో 180 సీట్లకు సంబంధించిన 1680 విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు వీసీ. ప్రో.గోవర్ధన్ సెలెక్టెడ్ లిస్టును విడుదల చేయనున్నారు.
NZB: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఇన్‌ఫ్లోగా 5,907 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దిగువకు 654 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాకతీయ కెనాల్‌కు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు. ప్రస్తుతం SRSPలో 1,066.20అడుగుల నీటిమట్టం ఉంది.
SRPT: హజూర్‌నగర్ పట్టణంలో H.P బంక్ ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డు వర్షాలు పడినప్పుడు గుంతలతో నిండిపోతుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్ బస్సులు, రైతులు, ట్రాక్టర్లు, లారీలు ఈ రహదారిలో ప్రయాణించలేకపోతున్నారు. రోడ్డుపై నీళ్లు నిలిచి బురదగా మారడం వలన ప్రయాణం చాలా కష్టంగా మారింది. వాహనదారులు, ప్రజలు సంబంధిత అధికారులను స్పందించాలని కొరారు.
MNCL: కన్నెపల్లి మండలం నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంకు మండల కాంగ్రెస్ నాయకులు భారీగా శుక్రవారం తరలివెళ్లారు. వారు మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిధిగా AICC అధ్యక్షులు ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.
PDPL:పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో క్లిష్టమైన సర్జరీలను వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. పోతుల స్రవంతికి గాలి బ్లాడర్‌లో స్టోన్‌తో కడుపు నొప్పి, వాంతులు లాంటి సమస్యలతో బాధ పడుతుండగా, విజయవంతంగా లాప్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. గడ్డం కవిత గర్భసంచిలో గడ్డలతో తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతుండగా, విజయవంతంగా ఆపరేషన్ చేశారు
MDK: మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈనెల 31 తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు విడుదలైనందున గడువు పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరారు.
BDK: పినపాక తాహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ బదిలీ అయ్యారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆయనను గుండాల తాహసీల్దార్‌గా నియమించారు. ఆయన స్థానంలో పినపాక తాహసీల్దార్‌గా అనూష నియమితులయ్యారు. ఈ బదిలీ ఉత్తర్వులు అధికారికంగా గురువారం విడుదలయ్యాయి.
KMM: తిరుమలాయపాలెం మండలానికి మంజూరైన ఐటీఐ కళాశాలను సర్వే నం. 254లోని రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించాలని అఖిలపక్ష నేతలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. రహదారి పక్కన నిర్మాణం వల్ల విద్యార్థులు, స్టాఫ్‌కు రవాణా సౌకర్యం ఉండటంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.
ADB: జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్‌గా నియమితులైన సభ్యులు MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షాను జిల్లా కేంద్రంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జంగుబాపు, శశికాంత్, లక్ష్మీకాంత్ తదితరులున్నారు.
KMM: తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా ప్రజల్లో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. నేడు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు..ప్రస్తుతం బనకచర్ల-పోలవరం ప్రాజెక్టు కారణం చూపిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరన్నారు.
MBNR: రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోలిపూర్ గ్రామ సరిహద్దుల్లో గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఐజాక్ తెలిపారు.
ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో పయనించాలన్నారు. గంజాయి పండించిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
HNK: భీమారంలోనీ 55వ డివిజన్లో గురువారం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనుకులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్ట్ నాయకపు సుభాష్ జ్ఞాపకార్థంగా కమ్యూనిటీ హల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.