NLG: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం మూడు పథకాలు అమలు చేయనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత మగ్గాలపై ఆధారపడిన వారు సుమారు 25 వేల మంది, మరమగ్గాలపై ఆధార పడినవారు 6 వేల మందికి లబ్ధి చేకూరనుంది. నేతన్న పొదుపు నిధికి రూ.115 కోట్లు, నేతన్న భద్రత కొరకు రూ.9 కోట్లు, నేతన్న భరోసాకు రూ.44 కోట్లు కేటాయించింది.
RR: ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిరసన తెలపకుండా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు పోలీసులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
WGL: సంక్రాంతి సెలవులు వచ్చిన సందర్భంగా సెలవులకు ఊర్లకు వెళుతున్న వారికి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ, మండల ప్రజలకు పట్టణ సీఐ రమణమూర్తి శనివారం పలు సూచనలు చేశారు. ఊరుకు వెళ్లే ముందు పేపర్ పాల ప్యాకెట్ వాళ్ళని మీరు వచ్చేవరకు రావద్దని చెప్పండి. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండ బ్యాంకు లాకర్లలో పెట్టాలని తెలిపారు.
MNCL: స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనవసరమైన ఫైళ్లు, మెసేజ్‌లను ఓపెన్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉందని జన్నారం ఎస్సై రాజ వర్ధన్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పండుగ డిస్కౌంట్లు, రీఛార్జీలు, ఏపీకే ఫైల్స్, బోనస్ పాయింట్లు, తదితర పేర్లతో స్మార్ట్ ఫోన్లకు మెసేజ్‌లు, లింక్ లు వచ్చే అవకాశం ఉందన్నారు. వాటిని ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయ్యి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.
BNR: జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ నేతలదాడిపట్ల నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ శనివారం ఫైర్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రిభువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీకార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ప్రశ్నించినందుకుదాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు.
NLG: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పద్మశాలి సంగం ఆధ్వర్యంలో శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా TPCC ప్రధాన కార్యదర్శి కైలాష్ నేత మాట్లాడుతూ..చేనేత కార్మికుల సంక్షేమం కోసం CM నూతన పథకాలను చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
NLG: పట్టణంలోని 30 వ వార్డు హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ నందు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జహంగీర్ బాబా ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ భాయి ముగ్గుల పోటీలను పరిశీలించారు. ముగ్గుల పోటీలను నిర్వహించడం మహిళల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో దోహద పడుతుందన్నారు.
NZB: యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ నాయకుల దాడిని MLC కవిత ‘X’ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఆమె దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతను గూండాయిజం చేసేలా తీర్చిదిద్దుతోందని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై NSUIనాయకుల దాడి, వారి నిజ స్వరూపాన్నిబయటపెట్టిందని మండిపడ్డారు. ఈ సిగ్గుచేటుకాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.
NZB: ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారును దుండగులు చోరీ చేసినట్లు శనివారం 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఆయన వివరాలు..గౌతమ్ నగర్‌కు చెందిన పవన్ ఈ నెల 9వ తేదీన తన ఇంటి ముందు కారు పార్క్ చేసి హైదరాబాదు వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి వచ్చే సరికి పార్కింగ్ చేసిన కారు చోరీకి గురైంది. బాధితుడు 3టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
HYD: భూగర్భంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగల ఏర్పాటు, నిర్వహణపై వివిధ దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.
KMM: మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల శిక్షణ ముగింపు కార్యక్రమం కు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KMM: బోనకల్ మండల పరిధిలోని ఆళ్ళ పాడు గ్రామంలో శనివారం జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
KMM: రూరల్ మండలం పల్లెగూడెం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రెడ్డిపల్లి, వెంకటాయపాలెం, పల్లెగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని సూచించారు.
KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కుమార్తెల పుట్టినరోజు వేడుకలను కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులు కుమార్తెలతో కలిసి కేకు కట్ చేశారు. అనంతరం చిన్నారులకు, వృద్ధులకు పాలు, పండ్లను పంపిణీ చేసి, కార్య కర్తలకు స్వీట్లు పంచి పెట్టారు.
NGKL: అమ్రాబాద్ మండలంలో రేపు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అమ్రాబాద్ మండలంలోని మొల్కమామిడి గ్రామంలో గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు ముఖ్య అతిథిగా ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొంటారని తెలిపారు.