HNK: హన్మకొండ ఆదాలత్ జంక్షన్ వద్ద ఆగే వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ భిక్షాటన చేస్తున్న ట్రాన్స్ జెండర్లకు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న కౌన్సిలింగ్ నిర్వహించారు. జంక్షన్ల వద్ద ఆగి ఉన్న వాహనదారులను ఇబ్బంది పెడుతూ భిక్షాటన చేయవద్దని హెచ్చరించారు. ప్రధానంగా వాహనాలు కదిలే సమయంలో అక్కడ ఉండటం వల్ల ప్రమాదానికి గురవుతారని సూచించారు.
BDK: మణుగూరు మండలంలోని వంద పడకల హాస్పిటల్ నందు కింగ్ డోమ్స్ కల్చర్ మినిస్ట్రీస్ ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫౌండేషన్ సభ్యులు అంజుమనార బేగం బీటీపీఎస్ నందు ఉద్యోగం చేసుకుంటూ సామాజిక సేవ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.
KMM: జులై 9 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఆటో బంద్ చేయాలని INTUC పార్లమెంట్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో ఆటో, ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
SRPT: మోతే మండలం విబులాపురం మామిళ్ళగూడెంలని పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో పట్టు సాధించాలని తెలిపారు. విద్యార్థులను తెలుగు చదివించారు, విద్యార్థులు తెలుగు మంచిగా చదువుతున్నారని కలెక్టర్ మెచ్చుకున్నారు.
PDPL: సుల్తానాబాద్ మున్సిపాలిటీ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీ.రమేష్ను గురువారం మధ్యాహ్నం సుల్తానాబాద్ మున్సిపల్ బీజేపీ నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డులలోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ADB: జైనద్ మండలం కూర గ్రామంలోని కొత్త కాలనీ తాగునీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటి ట్యాంకు శుభ్రం చేయక నాచు నీరు వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి ట్యాంకును శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. .
SRPT: మునగాలలో మురికినీరు రోడ్డుపై పారుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మురికినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
NLG: చిట్యాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.నేరడ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా మూర్చ రావడంతో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాలప్రకారం ఇవాళ సాధారణంగా పొలంలో పని చేస్తున్న సమయంలో రైతుకు అకస్మాత్తుగా మూర్చ వచ్చి మడిలో పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
NLG:- ఈనెల 14న తిరుమలగిరి మండలం మాలిపురంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సామేలు కోరారు. గురువారం శాలిగౌరారంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో గురువారం ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అలవాట్లలో మంచి మార్పులు తీసుకురావడానికి కార్యక్రమం చేపడుతున్నామని ప్రిన్సిపాల్ ప్రశాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరీం, రాజేంద్రప్రసాద్, అయ్యుబ్ ఖాన్, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
MBNR: మహబూబ్నగర్ రూరల్ మండలం మణికొండ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రజలు నాణ్యతగా కట్టుకోవాలని సూచించారు.
KMM: సత్తుపల్లి నూతన సీఐగా తుమ్మలపల్లి శ్రీహరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం మహిళ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన శ్రీహరి బదిలీపై సత్తుపల్లికి వచ్చారు. ఇక్కడ సీఐగా పనిచేసిన కిరణ్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిను నూతన సీఐ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
ADB: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మగవారిపై ఆర్థిక భారం పెరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా బోథ్ ఇన్ఛార్జ్ మజార్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లా నుంచి గుడిహత్నూరు వరకు రూ.30 ఉన్న టికెట్ ధరను రూ.50కి పెంచారని అన్నారు. దీంతో ప్రతిరోజు ప్రయాణించే పురుషులకు అదనపు ఆర్థిక భారం పెరుగుతుందని పేర్కొన్నారు.
HYD: జులై 4న ఎల్బీ స్టేడియంలో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని PCC వైస్ ప్రెసిడెంట్ బొంతు రామ్మోహన్, నారాయణపేట MLA పర్ణికారెడ్డి కోరారు. చేవెళ్ల MLA కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని, స్థానిక ఎన్నికల విధానాలపై చర్చిస్తారని తెలిపారు.
KMR: గాంధారి మండల కేంద్రంలోని CHCలో కంటి వైద్య శిబిరాన్ని గురువారం రోజున నిర్వహించారని ఆప్తాల్మిక్ ఆఫీసర్ డా.హరికిషన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేకించి వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. చూపు మందగించకుండా ఉండడం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆకుకూరలు తినడం లాంటివి చేయాలని అవగాహన కల్పించారు. చూపు మందగించిన వారు అద్దాలు తీసుకోవాలని కోరారు.