KMM: చెట్లను ప్రతి ఒక్కరు విధిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మధిర పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ గుప్తా అన్నారు. మధిర సాయి నగర్ కాలనీలో ఆదివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న మధిరకు మొక్కల అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు.
HYD: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నగరంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. పటేల్ చొరవతోనే హైదరాబాద్ గడ్డపై మువ్వెన్నల జెండా ఎగిరిందని గుర్తుచేశారు. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడని అన్నారు.
NLG: స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ 50 శాతం మించకూడదని జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండలో బీసీ బాలికల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు ఉద్యమాల దిశగా ముందుకు వెళ్లాలన్నారు. 42 శాతం అమలు చేయాలన్నారు.
KMM: ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగేందర్ అన్నారు. ఆదివారం ఖమ్మం 46 డివిజన్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు అనంతరం పలువురికి ఆయన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
SRPT: మహిళల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఆదివారం తిరుమలగిరిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చిందని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నాణ్యమైన, ఆకర్షణీయమైన చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
RR: బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
KMR: సదాశివనగర్ మండలంలోని పలు కార్యక్రమాలకు MLA మదన్ మోహన్ పర్యటిస్తున్నట్లు MLA క్యాంప్ ఆఫీస్ వర్గాలు ఇవాళ తెలిపారు. పద్మాజీవాడి గ్రామంలో ఉ.11: 30 గంటలకు స్ప్రింగ్ ఫిల్డ్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మోడెగాం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం పాల్గొని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
HYD: iBOMMA రవిని ఎన్కౌంటర్ చేయాలని ప్రముఖ నిర్మాత సీ. కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రవి తండ్రి అప్పారావు స్పందించారు. “ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. సినిమాలో విషయం ఉంటే జనం చూస్తారని, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారని ప్రశ్నించారు.
NLG: మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాలిగౌరారం మాజీ వైస్ ఎంపీపీ భూపతి అంజయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంత ఆలస్యమైనా మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు.
MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం భగవాన్ సత్యసాయి జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు సత్యసాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భగవాన్ సత్యసాయి చూపించిన మార్గం ప్రజలందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.
NZB: SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
ADB: భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. పట్టణంలోని కైలాష్ నగర్ సత్యసాయి ఆశ్రమంలో ఆయన శతజయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి MLA పాయల్ శంకర్‌తో కలిసి పూలమాలలు ఘన నివాళులర్పించారు. గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.
BDK: టేకులపల్లి మండలానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. మీ అందరి చల్లని దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు.
NRML: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మద్దతుదారులు గెలిచే విధంగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జూ సూచించారు. జన్నారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఆయనను అభినందించారు.
HYD: సౌదీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన 45 మంది అంత్యక్రియలు మదీనాలో అశ్రునయనాలతో అంత్య క్రియలు జరిగాయి. DNA రిపోర్టు వచ్చిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అక్కడి ప్రభుత్వం అప్పగించింది. దీంతో జన్నతుల్ బఖీ శ్మశానవాటికలో సామూహిక అంతిమ సంస్కరాలు నిర్వహించారు. యాత్రకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యుల రోధన కలచివేసింది.