NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం నల్గొండకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పట్టణంలోని ఒక హోటల్‌లో ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.
KMR: బాన్సువాడ మండలం బోర్లంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ జై జవాన్ అంటూ గ్రామ వీధులలో తిరిగి అంబేద్కర్ విగ్రహం, గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.
MNCL: భీమారం సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
HNK: జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సీఈవో, డిప్యూటీ సీఈఓ ల నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం. విద్యాలత, మేన శ్రీనివాస్, భూక్య రవి తదితరులు పాల్గొన్నారు.
MHBD: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనపై శుక్రవారం దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. మండల పరిధిలోని తూర్పు తండాకు చెందిన మాలోత్ దంజా అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనిపించడం లేదు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దంతాలపల్లి ఎస్సై రాజు తెలిపారు.
NZB: హర్యానాలోని కర్నల్ పానిపత్‌లో ఈ నెల 15 నుంచి 18 వరకు, జరుగుతున్నటు వంటి, 71వ మహిళల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి గోదావరి ఎంపిక కావడం జరిగింది. తెలంగాణ మహిళా కబడ్డీ క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర కబడ్డి సంఘం అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, కోచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
KMR: బాలికను అపహరించిన యువకుడికి స్థానికులు దేశ శుద్ధి చేసిన ఘటన గాంధారి మండలం మొండి సడక్ వద్ద శుక్రవారం జరిగింది. బోర్గం గురుకుల పాఠశాల నుంచి ఓ యువకుడు మొండి సడక్ వద్ద దుకాణాల్లో డబ్బులు అడుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చి స్థానికులు యువకుడిని నిలదీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆగ్రహించి అతనికి దేశ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
KMR: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్‌లో పట్టభద్రుల ఓటర్ల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల హామీ’ చెల్లని రూపాయిగా మారిందన్నారు.
NLG: నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. ఈ మేరకు ఓరైతు నుంచి రూ.12వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ రవి నాయక్ పట్టుబడ్డారు. దీంతో ఒక్కసారే ఏసీబీ అధికారులు దాడి చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
HYD: ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
SRD: కంగ్టి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాన్ని ఆర్డిఓ అశోక్ చక్రవర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడ్కల్ మండల ఏర్పాటులో రెండు గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంగా గాజుల పాడ్, సుక్కల్ తీర్థ్ గ్రామాలకు సందర్శించి గ్రామ ప్రజల అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. ఈ నివేదిక జిల్లా అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
MNCL: కవ్వాల్ గ్రామంలో చుట్టు పక్క ఉన్న చెరువులు, కుంటలలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అసైన్డ్ చెరువు శిఖం భూములను అడ్డు అదుపు లేకుండా కబ్జా చేశారు. చెరువులపై పడటంతో దీని విస్తీర్ణం క్రమక్రమంగా హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. చెరువు భూముల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని శుక్రవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
NRML: ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాదు ప్రాంతీయ ఆధార్ కార్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆధార్ కేంద్రాలలో సులువుగా ఆధార్ నమోదు,పేరు, చిరునామ తదితర వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
NZB: డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి పండగ శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఊరేగింపు చేపట్టగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. పెద్దమ్మ ఆలయంలో ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ,ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
KMR: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BJP అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ OBC జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.