మేడ్చల్: ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కిరణ్ స్కూల్ ఆధ్వర్యంలో5కే సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
మేడ్చల్: ఒడిశా రాష్ట్రం నుంచి హర్యానాకు తెలంగాణ మీదుగా తరలిస్తున్న 273 కిలోల డ్రై గంజాయిని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
KNR: పార్లమెంటులో వక్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసిన ఎంపీలు హిందువులే కాదని ఆదివారం కరీంనగర్ బీజేపీ అధికార ప్రతినిధి సుధాకర్ అన్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ కోసం ఓటు వేసిన వారందరికీ ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. అలాగే బోర్డుకు వ్యతిరేకంగా ఓటువేసిన వారు అసలు హిందువులే కాదన్నారు. వారిని అనవసరంగా ఎంపీగా గెలిపించకున్నామన్నారు.
HYD: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్టులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జేయియి మెయిన్స్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ ఏప్రీల్ 9), APEAPCET ( ఏప్రీల్ 24) ప్రక్రియ కొనసాగుతోంది.
KMR: సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినతులు పెట్టినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు ప్రతి ఇంటి నుంచి రూ.500 చొప్పున సొంతంగా చందాలు వసూలు చేసి ఆదివారం కొత్త బోరు వేసుకున్నారు. దీని కోసం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు.
JGL: రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యు డు కైరం పురుషోత్తం గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ముంబాయిలో ఉంటున్న పురుషోత్తం గౌడ్ ఆదివారం ఉదయం మృతి చెందగా.. రాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో అంత్యక్రియలు నిర్వహించారు. పురుషోత్తం గౌడ్ మృతికి పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని తన నివాసానికి సమీపాన ఉన్న శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కొబ్బరికాయ కొట్టి తన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి పూజారి నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశీర్వచనాలు అందుకున్నారు.
SRCL: ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతి చెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పుష్పలత పరిస్థితి విషమించి మరణించింది.
HNK: కాజీపేట మండల కేంద్రంలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై రేపు ఉదయం 8 గంటలకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగు మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యంగా జరుగుతున్న వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కూడా ఛైర్మన్ గట్టు ప్రసాద్ బాబు గౌడ్‌ను నేడు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య పరామర్శించారు. ప్రసాద్ బాబు అస్వస్థతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్న రాజయ్య బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి భరోసా కల్పించారు.
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది. భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తునకి తరలివచ్చారు. హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
HYD: మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈనెల 8న బాగ్ లింగంపల్లిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాల్ రాజు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సులో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక ధోరణులపై చర్చిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాలువాతో ఆశీర్వచనం అందించి ప్రసాదం అందజేశారు.
MNCL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ళలోపు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్బీఎస్‌కే బృందాలతో 37,920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
MNCL: బెల్లంపల్లి TBGKS నాయకులు దాసరి శ్రీనివాస్ తండ్రి దాసరి రాజం ఇటీవల మరణించగా తెలంగాణ రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా దాసరి రాజం చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.