• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు: ఎంపీ

SRD: దక్షిణ కాశీగా పేరుగాంచిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ సంగమేశ్వర్ 11 మంది సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారుచేసి ఇవ్వాలని అన్నారు.

April 7, 2025 / 06:59 PM IST

టెక్నాలజీకి మహిళల శక్తితోడైతే అభివృద్ధి: కలెక్టర్

SRD: టెక్నాలజీకి మహిళల శక్తి తోడైతే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉద్యానవన పంటలకు మహిళలు డ్రోన్ ద్వారా సేవలందిస్తే అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. డ్రోన్ శిక్షణను రాష్ట్రంలో మొదటిసారిగా మన జిల్లాలోనే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

April 7, 2025 / 06:52 PM IST

‘ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలి’

SRPT: ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని, ఆదివాసి జాతి హననాన్ని ఆపాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వర రావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని లాల్ బంగ్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

April 7, 2025 / 06:41 PM IST

కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి: భట్టి

HYD: సచివాలయంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్‌తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చలు నిర్వహించారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు.

April 7, 2025 / 06:02 PM IST

మీసేవ కేంద్రాల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

NLG: నకిరేకల్‌లోని మీసేవ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీనివాస్ గౌడ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వహణ తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. పట్టణంలో 13 మీ సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు.

April 7, 2025 / 05:54 PM IST

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

HYD: HCU భూములపై AI వీడియోలు, ఫోటోలు పెట్టారని కొందరిపై కేసులు పెట్టాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. కేటిఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులను ప్రాసిక్యూట్ చేయాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

April 7, 2025 / 05:51 PM IST

జిల్లా బీజేపీ అధ్యక్షుడికి శుభాకాంక్షల వెల్లువ

రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ రూరల్ అధ్యక్షునిగా నియామకమైన రాజగోపాల్ గౌడ్‌ను సోమవారం రాజేందర్ నగర్ డివిజన్ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పసుపుల సందీప్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించారు. ఈ కార్యక్రమంలో హరికిషన్, రజినీకాంత్ గుప్తా, మల్లేష్ చారి, సుధాకర్ రెడ్డి, విజయ్ యాదవ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2025 / 05:33 PM IST

విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలి: కలెక్టర్

ఖమ్మం: 8వ తరగతి నుంచి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, మా పాప- మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం, తదితర వాటిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు, వాటి నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.

April 7, 2025 / 04:57 PM IST

అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసణ

NLG: పెద్దవూర మండలం నాయిన వాని కుంట తండా అంగన్వాడీ కేంద్రంలో, సోమవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం అంగన్వాడీ టీచర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసే బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తున్నామని పోషక లోపం కలిగిన చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని అన్నారు.

April 7, 2025 / 04:39 PM IST

‘అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవండి’

WGL: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ సీపీ సన్రైత్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు కేశే అలియాస్ జెన్నీకి ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.4లక్షల రివార్డ్‌ను అందజేశారు. 

April 7, 2025 / 04:23 PM IST

‘ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి’

SRD: ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లపై వేధింపులను ఆపాలని కోరారు. ప్రభుత్వం వీరిని అన్ని విధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు. 

April 7, 2025 / 04:13 PM IST

అనారోగ్య బాధితులకు మాజీఎమ్మెల్యే పరామర్శ

NGKL: కోడేరు మండలం కొండ్రావుపల్లిలో అనారోగ్య బాదితలను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్సపొంది విశ్రాంతి తీసుకుంటున్న జూపల్లి శ్రీనివాసరావు, అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణయ్య లను వారి వారి నివాసాలలో హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

April 7, 2025 / 03:42 PM IST

గిరిజన నాయకుల ముందస్తు అరెస్టు

KMR: గిరిజన భవనం ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేవున్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిజన నాయకులను పోలీసులు నేడు అరెస్టు చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరాం నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుని వినోద్ చౌహన్‌లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

April 7, 2025 / 11:18 AM IST

గుండ్ల పోచంపల్లిలో ఆటో బోల్తా.. ట్రాఫిక్ జామ్

మేడ్చల్: గుండ్లపోచంపల్లి పరిధిలోని జయభేరి ఎన్ఎక్లేవ్ వద్ద లోడుతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాలు.. మేడ్చల్- కొంపల్లికి వెళ్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.

April 7, 2025 / 11:15 AM IST

పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్

హైదరాబాద్: తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్టర్ అజయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. హిందు దేవుళ్లను విమర్శిస్తూ అనవసరంగా మత కల్లోలాలకు తెర లేపుతున్నారంటూ రోమన్ క్యాథలిక్ జోసఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై కూడా అర్ధరహితంగా ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

April 7, 2025 / 11:13 AM IST